మనకు శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో బొప్పాయి ఒకటి. బొప్పాయిని పండుగా మాత్రమే కాదు పచ్చి బొప్పాయిని తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి బొప్పాయిని కూర వండుకొని తింటే దానిలో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. పచ్చి బొప్పాయిలో పపైన్ అనే శక్తివంతమైన దీర్ఘ ఎంజైమ్ ఉంటుంది. ఇది మన కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది.
పచ్చి బొప్పాయితో బరువుకు చెక్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంచడంలో ఎంతగానో దోహదం చేస్తుంది. పచ్చి బొప్పాయి లో ఉండే పోషకాలతోటి శరీర బరువు తగ్గే అవకాశం ఉంటుంది. పచ్చి బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కారణంగా ఇది తినడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. బొప్పాయి ఆకలిని నియంత్రిస్తుంది. దీని వల్ల శరీర బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
పచ్చి బొప్పాయిలో ఫుల్ పోషకాలు పచ్చి బొప్పాయి లో బీటా కేరోటిన్లు, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల పచ్చి బొప్పాయి తింటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పచ్చి బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనివల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మన శరీరానికి పోరాడే శక్తిని ఇస్తుంది. పచ్చి బొప్పాయి లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ అధికంగా ఉంటాయి. ఇవి న్యాచురల్ గా మన శరీరంలోని వ్యర్ధాలను డిటాక్సిఫై చేస్తాయి. పచ్చి బొప్పాయితో డయాబెటిస్ కంట్రోల్ దీనివల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మొటిమలు తగ్గుతాయి. పచ్చి బొప్పాయి లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. పచ్చి బొప్పాయి లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పచ్చి బొప్పాయి లో విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు బీటా కెరోటిన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇంఫ్లేషన్ ను తగ్గిస్తాయి.

Leave feedback about this