June 8, 2025
తాజా వార్తలు

కొవ్వలి సేవలు అభినందనీయం – భాస్కర్ నాయుడు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు గారి నివాసం వద్ద సంకు భాస్కర్ నాయుడు, మల్లాడి మూర్తి, నంద్యాల బాబు, Md.మౌలాలి ఫిబ్రవరి నెలకు సంబంధించి కొవ్వలి ఫౌండేషన్ ద్వారా నిత్యవసర సరుకులను పేద మహిళలకు అందజేశారు. అనంతరం భాస్కర్ నాయుడు గారు మాట్లాడుతూ కొవ్వలి ఫౌండేషన్ స్థాపించిన దగ్గర నుంచి ఈరోజు వరకు ప్రతి నెల నిరుపేదలకు అవసరమైన నిత్యవసరసరుకులు, మందులు, అర్హులైన వారికి ఆపరేషన్లు మరియు గృహ నిర్మాణాలు చేయిస్తున్న మన ప్రియతమ నాయకులు కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు ని అభినందిస్తూ ఆయన ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకం చేయాలని ఆయన ఎంచుకున్న రంగంలో విజయ పథంలో పయనించాలని మనస్పూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వలి ఫాలోవర్స్ మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video