June 8, 2025
ఆరోగ్యం

కళ్ళవాపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ నివారణలు మీకోసమే!

కళ్ళ చుట్టూ వాపు.. ఇది ఒక రకమైన కంటి సమస్య. ఈ సమస్యతో చాలా మంది తెగ బాధపడుతూ ఉంటారు. కళ్ళ చుట్టూ వాపు కొంతమందికి ఎక్కువగా ఉదయం నిద్ర లేచిన వెంటనే కనిపిస్తుంది. విపరీతంగా ఏడ్చిన వారికి కూడా కళ్ళ చుట్టూ వాపు రావటం మనం చాలా సందర్భాలలో గమనిస్తూ ఉంటాం. అయితే చాలామందికి ఈ కళ్ళ చుట్టూ వాపు కొద్దిసేపటి తరువాత తగ్గిపోతే మరి కొంతమందికి ఎక్కువసేపు కళ్ళ చుట్టూ వాపు సమస్య ఉంటుంది.

కళ్ళ చుట్టూ వాపు.. ఇదొక కారణం ఇక అలాంటివారు కళ్ళవాపు తగ్గాలంటే ఎలాంటి చిట్కాలను పాటించాలో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. కళ్ళ చుట్టూ వాపు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ముఖ్యంగా మంచి నిద్ర పోవాలి. కచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవాల్సిన అవసరం ఉంది. అసలే నిద్ర తక్కువ పోకూడదు.

వీటితో కళ్ళవాపు తగ్గుతుంది టీ బ్యాగ్ ను కొద్దిగా నీటితో తడిపి దానిని ఫ్రిజ్లో పెట్టి అది గడ్డ కట్టిన తర్వాత కంటి కింద పది నిమిషాలు సాధారణ ఉష్ణోగ్రత వచ్చేవరకు ఈ టీ బ్యాగ్ ఐస్ క్యూబ్ ను ఉంచితే ఈ ఐస్ క్యూబ్ తో కూడా కళ్ళ వాపు సమస్య తగ్గుతుంది. కాఫీ క్యూబ్స్ తో కళ్ళ చుట్టూ మసాజ్ చేయడం వల్ల కూడా కళ్ళ వాపు తగ్గుతుంది. వీటిని వాడి చూడండి… కళ్ళవాపుకు చెక్ దీనికి చేయవలసింది నీటిని వేడి చేసి ఒక చెంచా కాఫీ పొడిని దానిలో వేసి మరిగించి ఆ నీరు చల్లారిన తర్వాత ఐస్ ట్రేలో పోసి భద్రపరుచుకుంటే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఆ క్యూబ్స్ తో కళ్ళ చుట్టూ నిదానంగా మసాజ్ చేస్తే కళ్ళ వాపు తగ్గుతుంది.ఒక కీర దోసకాయ ముక్కను కానీ బంగాళాదుంపని గాని కట్ చేసి కళ్ళ పైన కాసేపు పెట్టుకుంటే వాపు సమస్య తగ్గుతుంది. Pow

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video