Mud Pot Air Coolers : భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవిలో ఉపశమనం కోసం ఒక చవకైన, పర్యావరణానికి మేలు చేసే కూలింగ్ ఆప్షన్ బాగా పాపులర్ అవుతోంది. అదే మట్టి కుండ కూలర్ (Mud Pot Air Cooler). గతంలో కేవలం మంచినీళ్లు చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగించిన మట్టి కుండలు, ఇప్పుడు వినూత్నంగా రూపాంతరం చెందాయి.
ఖరీదైన ఏసీలు లేదా ఎలక్ట్రిక్ కూలర్లు కొనలేని వారికి, ఇవి తక్కువ ఖర్చుతోనే వేడి నుంచి ఉపశమనం అందించే అద్భుతమైన పరికరాలుగా మారుతున్నాయి. మట్టి కుండలు ఎందుకంత స్పెషల్? ఇవి ఎలా పనిచేస్తాయ్, వీటి ధర ఎంత వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* ఇవి ఎలా పనిచేస్తాయి..? మట్టి కుండలకు చిన్న చిన్న రంధ్రాలు (Porous) ఉంటాయి. దీనివల్ల లోపల ఉన్న నీరు నెమ్మదిగా కుండ గోడల ద్వారా బయటకు వచ్చి ఆవిరవుతుంది. ఈ ప్రక్రియ గాలిలోని వేడిని లాగేసి, గాలిని సహజంగా చల్లబరుస్తుంది. మనం కుండలో నీళ్లు పోస్తే ఫ్రిజ్లో పెట్టకపోయినా చల్లగా ఉండటానికి కారణం ఇదే. మట్టి కుండ కూలర్లు కూడా ఇదే సూత్రంపై పనిచేస్తాయి. వీటిని చేతులతో తయారుచేస్తారు. లోపల నీళ్లు పోయడానికి ఖాళీ స్థలం ఉంటుంది. పైన ఒక చిన్న ఎలక్ట్రిక్ ఫ్యాన్ పెడతారు. ఈ ఫ్యాన్ గాలిని కుండ లోపలికి పంపిస్తుంది. ఆ గాలి, ఆవిరవుతున్న నీటిని, చల్లని కుండ ఉపరితలాన్ని తాకుతూ బయటకు వచ్చినప్పుడు, అది చాలా చల్లగా మారుతుంది.

Leave feedback about this