December 25, 2025
తాజా వార్తలు

ఏటీఎం ఛార్జీల బాదుడు షురూ.. కొత్త ఛార్జీలు ఇవే

ఆన్ లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు పెరిగినా ఇప్పటికీ చాలా మంది ఏటీఎం ద్వారానే నగదు విత్ డ్రా చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. ఏటీఎం విత్‌ డ్రా ఛార్జీలు మే 1 నుంచి పెరగనున్నాయి. కొత్త ఛార్జీలు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నాయి. ఉచిత పరిమితిని మించి చేసే ఏటీఎం లావాదేవాలపై ఛార్జీల పెంపునకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఇతర బ్యాంక్ ఏటీఎం ఉపయోగించినప్పుడు రెండు బ్యాంకుల మధ్య ఈ ఛార్జీలు ఉంటాయి. అలాగే ఉచిత ట్రాన్సాక్షన్ లిమిట్ దాటితే ఏటీఎం విత్ డ్రా ఛార్జీలు రూ.21 నుంచి రూ. 23కు పెంచారు. ఇక మెట్రో నగరాల్లో 3 అదే విధంగా నాన్ మెట్రో ప్రాంతాల్లో 5 ఉచిత ఏటీఎం లావాదేవీలకు పరిమితి ఉంటుంది.ఉచిత లావాదేవీల పరిమితి దాటితే ఒక కస్టమర్‌కు ప్రతి లావాదేవీకి గరిష్టంగా రూ.23 వసూలు చేయవచ్చు. ఇది 2025 మే 1 నుంచి అమలులోకి వస్తుందని ఆర్‌బీఐ తాజాగా ప్ర‌క‌టించింది. మే 1 నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఛార్జీలు పెంచుతున్నట్లు ఈ మేరకు వెల్లడించింది. ఏటీఎం నిర్వహణ ఖర్చులు పెరగడం, సెక్యూరిటీ కోసం ఖర్చులు ఎక్కువగా అయ్యాయని ఆర్బీఐ వివరణ ఇచ్చింది.

ఇక ఉచిత లావాదేవీల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉచిత లావాదేవీ పరిమితుల్లో ఎలాంటి మార్పులు లేవు. సొంత బ్యాంకు ఏటీఎంలో నెలకు 5 ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఇక ఇతర బ్యాంకుల ఏటీఎం విషయానికి వస్తే.. మెట్రో గరాల్లో అయితే 3 లావాదేవీలు, నాన్ మెట్రో నగరాల్లో 5 లావాదేవీలు ఉచితంగా చేసుకునేందుకు వీలుంది.ఆన్ లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు కారణంగా తక్కువ సం​ఖ్యలో ఏటీఎంలు ఉన్నాయి. దీంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులు నగదు ఉపసంహరణ కోసం పెద్ద బ్యాంకుల ఏటీఎంలపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి కస్టమర్లు అధిక ఛార్జీలను భరించాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video