జుట్టు రాలే సమస్య ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య. ఒక మనిషి అందాన్ని ఇనుమడింపజేసేది జుట్టు. జుట్టు లేకపోతే ఎంత అందంగా ఉన్న మనిషి అయినా అందవిహీనంగా కనిపిస్తారు. అంతేకాదు జుట్టు ఆరోగ్యం సదరు మనిషి ఆరోగ్యాన్ని కూడా స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతుంది. ఇప్పుడు వేసవి కాలంలో చాలామంది జుట్టు రాలిపోతుందని తెగ బాధపడుతున్నారు.
ఈ నీళ్ళతో జుట్టు బలోపేతం అటువంటివారు జుట్టు రాలకుండా దృఢంగా ఆరోగ్యంగా పెరగడం కోసం కొన్ని చిట్కాలను పాటిస్తే మంచిది. ఆ చిట్కాల విషయానికి వస్తే బియ్యం కడిగిన నీళ్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. బియ్యం కడిగిన నీళ్లలో జుట్టు కోసం కావలసిన ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తలకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
Leave feedback about this