August 30, 2025
భక్తి

తిరుమలకు వచ్చే వారికి గుడ్ న్యూస్

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు శ్రీవారి దర్శించుకున్న భక్తుల సంఖ్య 80 వేలను అధిగమించింది. ఆ ఒక్క రోజే 83,380 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,936 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచివుండలేదు. క్యూలైన్ ద్వారా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 2 నుంచి 4 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ ఇచ్చింది. ఘాట్ రోడ్ల మరమ్మతులు చేపట్టనుంది. రెండు ఘాట్ రోడ్లకు కూడా మరమ్మతులు నిర్వహించడం, వాటిని అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. దీనికోసం 10.75 కోట్ల రూపాయలను కేటాయించింది. తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య భారీగా పెరగడం, వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.ఏపీఎస్ఆర్టీసీ సహా వివిధ బస్సులు, కార్లు, టీటీడీ అవసరాల కోసం సరుకులను తరలించే లారీలు, టిప్పర్లు సహా రోజుకు దాదాపు 10,000కు పైగా వాహనాలను ఘాట్ రోడ్ల మీదుగా తిరుమల- తిరుపతి మధ్య రాకపోకలు సాగిస్తుంటాయి. అధిక లోడ్, వర్షాల వల్ల అక్కడక్కడ రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఫలితంగా ఈ మధ్యకాలంలో ఘాట్ రోడ్లలల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి.ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఘాట్ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. చివరిసారిగా 2021 జనవరిలో బిటుమినస్ పద్ధతిలో ఘాట్ రోడ్లను పునరుద్ధరించారు. అదే ఏడాది నవంబర్/డిసెంబర్‌లల్లో కురిసిన భారీ వర్షాల వల్ల క్రాష్ బారియర్లు సహా రోడ్లు దెబ్బతిన్నాయి. ఆ తరువాత తరచూ పూర్తిస్థాయిలో రోడ్ల మరమ్మతు పనులు చోటు చేసుకోలేదు.ఇప్పుడు 10.75 కోట్ల రూపాయల వ్యయంతో మరమ్మతులు, అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. బిటుమినస్ మెకాడమ్‌ను బేస్ లేయర్‌గా ఉపయోగించాలని భావిస్తోంది. రాత్రివేళ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ వాహనాలు సజావుగా రాకపోకలు సాగించేలా రోడ్ల నిర్మాణం చేపట్టనుంది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video