తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. గురువారం అర్ద్రరాత్రి ఏపీలోని పలు జిల్లాలో భారీ ఈదురు గాలులతో పాటుగా వర్షం కుండపోతగా కురిసింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది. ఏపీతో పాటుగా తెలంగాణలోని పలు ప్రాంతాలను రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఇక, ఈ నెల 27న కేరళను రుతుపవనాలు తాకనుండగా.. జూన్ 5 నాటికి ఏపీలో ప్రవేశిస్తాయని అంచనాగా వెల్లడించారు.ఏపీలోని పలు జిల్లాలో ఈదురు గాలులు – వర్షం భీభత్సానికి కారణమయ్యాయి. కోస్తా ప్రాంతంలోని పలు జిల్లాల్లో ప్రభావం కనిపించింది. అర్ద్రరాత్రి వచ్చిన ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో చెట్టు కూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెద్ద హోర్డింగ్స్ నేల మట్టం అయ్యాయి. కాగా, అండమాన్ నికోబర్ దీవుల్లో నైరుతి రుతు పవనాలు చురుకుగా కదులుతున్నాయి. వచ్చే నెల మొదటి వారం నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. జూన్ 5 నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 10 నాటికి ఉత్తరాంధ్ర సహా రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.గురువారం తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నమోదయ్యాయి. ఉదయం నుంచి 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. కాసేపు మబ్బులు, కాసేపు వడగాలులు, కాసేపు ఆక స్మికంగా పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలుతో వాతావరణం దోబూచులాడింది. రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల మోస్తరు వాన లు కురిశాయి. అండమాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో వాయువ్య, నైరుతి దిశగా వీస్తున్న గాలుల వల్ల ఈ భిన్న వాతావరణం ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలోని అనూహ్య మార్పుల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.ఇక, ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకా పల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు పడేందుకు అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయ నగరం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక శనివారం అల్లూరి సీతారామ రాజు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
వర్ష బీభత్సం, మరో రెండు రోజులు – ఏపీలో ఈ జిల్లాలకు కీలక హెచ్చరిక..!!
- by kadali Lavanya
- May 16, 2025
- 0 Comments
- Less than a minute
- 84 Views
- 7 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this