August 30, 2025
రాష్ట్రీయ వార్తలు

ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో జరిగిన అక్రమాలపై​ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ మేరకు 2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై సిట్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యలతో సిట్‌ బృందాన్ని నియమించింది. సిట్‌లో సభ్యులుగా ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్‌, సీఐడీ ఏఎస్పీ శ్రీహరిబాబు, డోన్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ శివాజీని నియమించారు. సీఐడీ డీఐజీ ఆధ్వర్యంలోనే సిట్‌ పని చేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సిట్‌ బృందానికి పూర్తి అధికారాలు కల్పించారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video