AP 10th Class Hall Ticket 2025 : ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సబ్జెక్టుల వారీగా పబ్లిక్ పరీక్షల తేదీలను విద్యాశాఖ ఇప్పటికే వెల్లడించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగునున్నాయి. మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి. AP SSC Exams 2025 షెడ్యూల్ ప్రకారం మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. అలాగే.. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు (AP SSC Hall Tickets 2025) మార్చి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
AP 10th Class Time Table 2025
- మార్చి 17, 2025 (సోమవారం) ఫస్ట్ ల్యాంగ్వేజ్, ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 పరీక్ష
- మార్చి 19, 2025 (బుధవారం) సెకండ్ ల్యాంగ్వేజ్ పరీక్ష
- మార్చి 21, 2025 (సోమవారం) ఇంగ్లిష్ పరీక్ష
- మార్చి 22, 2025 (శుక్రవారం) ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 2, -OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 1
- మార్చి 24, 2025 (సోమవారం) మ్యాథమెటిక్స్ పరీక్ష
- మార్చి 26, 2025 (బుధవారం) ఫిజికల్ సైన్స్ పరీక్ష
- మార్చి 28, 2025 (శుక్రవారం) బయోలాజికల్ సైన్స్ పరీక్ష
- మార్చి 29, 2025 (శనివారం) OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2, SSC ఒకేషనల్ కోర్సు
- మార్చి 31 లేదా ఏప్రిల్ 1, 2025 (సోమవారం లేదా మంగళవారం) సోషల్ స్టడీస్ పరీక్ష
గమనిక : మార్చి 31వ తేదీన రంజాన్ సెలవు దినంగా ప్రభుత్వ కేలండర్లో ఉంది. నెలవంక మార్చి 31వ తేదీన కనిపిస్తే అదే రోజున రంజాన్ ఉంటుంది. ఒకవేళ ఆ రోజున పండుగ వస్తే ఏప్రిల్ 1వ తేదీన సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులరెడ్డి ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు.
మరోవైపు తెలంగాణ 10వ తరగతి తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే TS SSC 2025 పరీక్షల షెడ్యూల్‌ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ పరీక్షలు నిర్వహించనుంది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు టెన్త్‌క్లాస్ పరీక్షలు నిర్వహించనుంది. అయితే.. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదట్లో అధికారిక వెబ్సైట్లో విడుదల చేసే అవకాశం ఉంది. రెగ్యులర్, ప్రైవేట్, ఒకేషనల్, OSSC విద్యార్థుల కోసం అదే రోజు హాల్‌టికెట్లు విడుదల చేయనున్నారు.
Leave feedback about this