August 30, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

ఇంటర్, పదో తరగతి ఫలితాల వేళ బిగ్ డెసిషన్..!!

ఇంటర్ – పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్ధులకు బిగ్ అప్డేట్. రెండు రాష్ట్రాల్లో పరీక్షా ఫలితాల వెల్లడి పైన బిగ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తయింది. ఇక విద్యార్ధుల మార్కుల కంప్యూటరీకరణ ప్రాసెస్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. జవాబుపత్రాలను మూడేసి సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్‌, డీకోడింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు. ఫలితాలు సులభంగా తెలుసుకునేందుకు పలు ఆప్షన్లను విద్యార్ధుల కోసం సిద్దం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ దాదాపు ఒకే సమయంలో ఇంటర్ – పదో తరగతి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఇంటర్ ఫలితాలు ఇంటర్ – పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు ఫలితాల కోసం ఉత్కంఠగా చూస్తున్నారు. ఏపీలో మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 25 కేంద్రాల్లో మార్చి 17 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించగా మొత్తం నాలుగు విడుతల్లో పూర్తి చేశారు. ఇక విద్యార్ధుల మార్కుల కంప్యూటరీకరణ ప్రాసెస్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ నెల 15 లేదా 17న ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కోరుతు అధికారులు వివరాలు సమర్పించారు. తెలంగాణలో ఇంటర్మీయట్‌ పరీక్షల ఫలితాలను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు తెలిపింది.

ఏపీలో ఇంటర్ ఫలితాల కోసం ఈ సంవత్సరం టెన్త్, ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల చేసినట్టుగానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాలు కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సారి ఫలితాలను వాట్సాప్‌ నంబర్ 9552300009 లేదా BIEAP అధికారిక వెబ్‌సైట్‌ https://bie.ap. gov.in/ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తు న్నారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం tsbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్‌సైట్లలో సంప్రదించాలని ఇంటర్‌ బోర్డు సూచించింది. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థుల సౌలభ్యం కోసం మార్కుల జాబితాను వివిధ మార్గాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు వివరించింది. దీంతో, విద్యార్ధులకు ఫలితాలు వెల్లడించిన వెంటనే తెలుసుకునే వెసులుబాటు కలగనుంది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video