గుంటూరు సిటీకి అదిరిపోయే న్యూస్ చెప్పిన కేంద్రం..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కేంద్రం నుంచి వరుసగా శుభవార్తలు అందుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలోని నగరాల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన పలు సమస్యలకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పరిష్కారాలు చూపిస్తోంది. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు చూపిస్తున్న చొరవకు కేంద్రం సాయం కూడా తోడవడంతో గుంటూరుకు మరో గుడ్ న్యూస్ అందింది. అమరావతి రాజధానిలో కీలకమైన గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేసే పరిస్ధితి