June 7, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

APPSC Group 2 Mains Key 2025 : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ ఆన్సర్‌ కీ వచ్చేసింది.. లింక్‌ ఇదే

APPSC Group 2 Mains Answer Key 2025 : ఆంధ్రప్రదేశ్‌లో అనేక పరిణామాల అనంతరం ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి. ఫిబ్రవరి 23 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మెయిన్స్‌ పేపర్‌-1 నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్‌-2 నిర్వహించారు. 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది (92 శాతం) పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పలుచోట్ల పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో.. అధికారులు, పోలీసులు వారిని వెనక్కి పంపించారు. అయితే.. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీ ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video