AP Intermediate : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్‌లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను, సీబీఎస్‌ఈ (CBSE Board) విధానాలను అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు తగిన విధంగా కార్యచరణ ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు పూర్తయిన వెంటనే సెకండియర్ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్‌తో పాటు పోటీ పరీక్షలకు సంబంధించి 23వ తేదీ వరకు క్లాసులు నిర్వహించనుంది. అనంతరం ఏప్రిల్ 24 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి.
ఎడ్యుకేషన్ & కెరీర్
వేసవి సెలవులు తగ్గింపు.. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు హాలిడేస్!
- by kowru Lavanya
- February 22, 2025
- 0 Comments
- Less than a minute
- 100 Views
- 6 months ago

Leave feedback about this