June 8, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

CBSE Result 2025 : సీబీఎస్‌ఈ 10th Class రిజల్ట్‌ ఎప్పుడో తెలుసా?

CBSE Class 10 Result 2025 Date : 2025 సంవత్సరానికి సంబంధించిన CBSE Board 10వ తరగతి ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. విద్యార్థులు తమ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పరీక్షా ఫలితాలు మే నెల ప్రారంభంలో వెలువడే అవకాశం ఉంది. విద్యార్థులు ఫలితాలు వెలువడిన తర్వాత 11వ తరగతికి సైన్స్, కామర్స్ లేదా ఆర్ట్స్‌లో దేనినైనా ఎంచుకుంటారు. ఇది వారి భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయం. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ లేదా డిజిలాకర్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

CBSE 10వ తరగతి ఫలితాల ప్రకటన విద్యార్థులకు చాలా కీలకమైనది. ఎందుకంటే ఇది ఉన్నత చదువుల వైపు వారి విద్యా ప్రయాణానికి నాంది పలుకుతుంది. విద్యార్థులు వారి ఫలితాలు తెలుసుకున్న తర్వాత విద్యార్థులు 11వ తరగతికి ఏ స్ట్రీమ్‌ను ఎంచుకోవాలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. సైన్స్, కామర్స్‌ లేదా కళలు (హ్యుమానిటీస్) ఇలా ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వారి భవిష్యత్తు కెరీర్ మార్గాలు మరియు అవకాశాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video