ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ ఎవెయిటెడ్ మూవీస్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది SSMB29. కారణం సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబో. వీళ్లిద్దరూ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రాజమౌళి సినిమాను ఎంత శ్రద్ధగా తీస్తారో.. షూటింగ్ కూడా అలానే చేస్తారని మనకి తెలిసిందే.ఇక ఆయన సినిమాలకు సంబంధించిన సీన్స్ ఎక్కడా బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడతారు. ఇప్పటికైతే ఈ సినిమాకు సంబంధించి ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు. సినిమా టైటిల్ కూడా ప్రకటించలేదు. కానీ షూటింగ్ మాత్రం వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కూడా పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఓ ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించనుంది చిత్ర బృందం.అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా రూమర్స్ బయటకు వచ్చాయి. కానీ వాటిపై మూవీ టీమ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు మరో వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. దీనిపై అఫిషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు. అటు చియాన్ విక్రమ్ కూడా దీనిపై ఎలాంటి పోస్టు పెట్టలేదు.అయితే ఇదే విషయంపై అటు మహేశ్ బాబు ఫ్యాన్స్ రాజమౌళిపై ఫైర్ మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఆఖరికి మల్టీస్టారర్ చేశాడని అంటున్నారు. ఇప్పటికే పృథ్విరాజ్ సుకుమారన్ ను తీసుకుని.. మళ్లీ ఇప్పుడు విక్రమ్ అంటే.. ఇక ఇది మహేశ్ సినిమా కాదని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.ఇక ఎస్ఎస్ఎంబీ29 ప్రాజెక్టు లో మహేశ్ బాబుతోపాటు, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మళయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, ఇండోనేషియా నటి చెలిసా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆస్కార్ ఆవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. అంతేకాక హాలీవుడ్ కు చెందిన టాప్ టెక్నీషియన్లు VFX వర్క్ చేయబోతున్నట్టు సమాచారం.దాదాపు రూ. 1000 కోట్లతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. మహేశ్ బాబు ఇందులో ఓ ఆర్కియాలజిస్ట్, జేమ్స్ బాండ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమా
మహేశ్ బాబును నమ్మించి మోసం చేసిన రాజమౌళి..? అలిగిన బాబు..!
- by kadali Lavanya
- May 16, 2025
- 0 Comments
- Less than a minute
- 2 Views
- 4 hours ago

Leave feedback about this