తెలుగు సినీ లోకంలో శోభన్ బాబు అనే పేరు ఒక స్వర్ణాక్షరంగా నిలిచిపోయింది. ఆయన నటించిన సినిమాలు నేటికీ ప్రేక్షకుల మనసులో మిగిలేలా చేస్తాయి. తనదైన నటనతో, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈ మహానటుడు, తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఇక ఈ లోకంలో లేకపోయినా, ఆయన కళా వారసత్వం తెలుగు సినీ ప్రపంచంలో ఇంకా ప్రకాశిస్తూనే ఉంది. కానీ శోభన్ బాబు మాత్రం తన కుటుంబ సభ్యులను సినిమా రంగానికి పరిచయం చేయలేదు.అయితే ఆయన వారసులు ఇతర రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ శోభన్ బాబు పేరును మరో కోణంలో వెలిగిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన, వైద్య రంగంలో ఓ అద్భుత విజయాన్ని సాధిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.చెన్నైలో ప్రముఖ గైనకాలజిస్ట్‌గా సేవలందిస్తున్న డాక్టర్ సురక్షిత్ ఇటీవల ఓ అరుదైన శస్త్రచికిత్స చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేశారు. 44 ఏళ్ల మహిళ గర్భాశయంలో ఏర్పడిన 4.5 కిలోల సిస్టును, సాధారణంగా ఓపెన్ సర్జరీ చేయాల్సిన స్థితిలో ఉన్నా, అత్యాధునిక “ట్రూ 3డి ల్యాపరోస్కోపిక్” పద్ధతిలో తొలగించి చరిత్ర సృష్టించారు. ఈ విజయం వైద్య రంగంలో ఒక సంచలనం గానూ నిలిచింది. సుమారు ఎనిమిది గంటల పాటు నిరంతరంగా శస్త్రచికిత్స చేసి, సురక్షిత్ విజయవంతంగా ఆ ఆపరేషన్‌ను పూర్తిచేశారు. ఈ ఆపరేషన్ ద్వారా మహిళా ప్రాణాలను రక్షించడమే కాక, అత్యాధునిక సాంకేతికత సామర్థ్యాన్ని మరోసారి నిరూపించారు.2016లో చెన్నైలో ‘ఇండిగో ఉమెన్స్ సెంటర్’ను స్థాపించిన డాక్టర్ సురక్షిత్, అప్పుడే “ట్రూ 3డి ల్యాపరోస్కోపిక్” టెక్నాలజీని భారతదేశంలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఆయన చేసిన పది వేలకుపైగా సర్జరీలు వైద్యరంగంలో ఆయన కృషికి నిదర్శనంగా నిలిచాయి. సులభ రికవరీతోనే కాకుండా, అధునాతన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
సినిమా
గిన్నీస్ రికార్డు సాధించిన హీరో శోభన్ బాబు మనవడు..!
- by kadali Lavanya
- May 6, 2025
- 0 Comments
- Less than a minute
- 50 Views
- 8 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this