June 8, 2025
తాజా వార్తలు

దుబాయ్‌లో అంగరంగ వైభవంగా ‘GAMA’ అవార్డ్స్

GAMA అవార్డ్స్ 2025, 5వ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ దుబాయ్‌లో ఘనంగా జరిగింది.ఈ వేడుకకు దుబాయ్‌లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని, GAMA ప్రాముఖ్యతను చాటి చెప్పారు.మొదటిసారి సరికొత్తగా, వినూత్నంగా ఈ గ్రాండ్ రెవీల్ ఈవెంట్ నిర్వహించబడం జరిగింది.ఈ వేడుకలో గామా ఆర్గనైజింగ్ కమిటీ, ప్రముఖ గాయకుడు శ్రీ రఘు కుంచె సమక్షంలో ఈవెంట్ తేదీ, వేడుకలను జ్యూరీ కమిటీని అధికారికంగా ప్రకటించారు.

GAMA అవార్డ్స్ 2025, 5వ ఎడిషన్ తేదీ (జూన్ 7, 2025) దుబాయ్ షార్జా ఎక్స్పో సెంటర్లో నిర్వహించబోతున్నారు. GAMA AWARDS చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ.. గత నాలుగు ఎడిషన్లు గ్రాండ్‌గా నిర్వహించామని.. జూన్ 7న జరగబోయే 5వ ఎడిషన్‌కు ప్రముఖ సినీ పెద్దలను, కళాకారులను విశిష్ట అతిథులుగా ఆహ్వానిస్తున్నామన్నారు. UAEలోని తెలుగు ప్రజలకు ప్రత్యేక వినోదాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.⁠

కుంచె రఘు గారు మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ లో నాలాంటి కళాకారులు ఎందరో ఆసక్తిగా ఎదురు చూసే ఈవెంట్ ఈ GAMA ఈవెంట్ అని అన్నారు. GAMA తో మాకు చాలా మంచి అనుబంధం ఉందని అన్నారు. మా కళా కారుల అందరిని మంచి వసతులు ఇచ్చి చాలా బాగా చూసుకుంటారు అని చెప్పారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video