వేసవి వచ్చేసింది! మండుతున్న ఎండలు, ఉక్కపోత, పెరిగిన ఉష్ణోగ్రతలు మనల్ని నీరసపరుస్తాయి. ఈ సమయంలో శరీరాన్ని చల్లగా, ఉత్సాహంగా ఉంచడానికి మనం రకరకాల శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ ఆశ్రయిస్తాం. అయితే, వాటిలో చాలా వరకు చక్కెర, కృత్రిమ రంగులు, రసాయనాలతో నిండి ఉంటాయి. ఇవి తాత్కాలిక ఉపశమనం ఇచ్చినప్పటికీ, దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మన సంప్రదాయ పానీయమైన ‘రాగి జావ’ ఒక అద్భుతమైన, సహజసిద్ధమైన ప్రత్యామ్నాయం. ముఖ్యంగా వేసవిలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో రాగి జావ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.శరీరాన్ని చల్లబరుస్తుంది: వేసవిలో రాగి జావ తాగడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఇదే. రాగి సహజంగానే శరీరంలోని అధిక వేడిని గ్రహించి, చల్లదనాన్ని అందిస్తుంది. ఉదయాన్నే ఒక గ్లాసు రాగి జావ తాగితే, పగలంతా ఎండలో తిరిగినా శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఇది ఒక సహజసిద్ధమైన కూలెంట్ లా పనిచేస్తూ, వడదెబ్బ తగలకుండా చూస్తుంది.
ఆరోగ్యం
వేసవిలో వేడికి విరుగుడు.. ఉదయాన్నే ఇది తాగితే చాలు ఆరోగ్యం ఫుల్!
- by kowru Lavanya
- May 1, 2025
- 0 Comments
- Less than a minute
- 34 Views
- 4 months ago

Leave feedback about this