July 19, 2025
ఆరోగ్యం

టైప్ 5 డయాబెటిస్.. యువతకు దడ పుట్టిస్తుందిగా!

డయాబెటిస్.. ఇప్పుడు సమాజంలో సగానికి ఎక్కువమంది బాధపడుతున్న దీర్ఘకాలిక వ్యాధి. డయాబెటిస్ బారిన పడినవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే డయాబెటిస్ మన ఆర్గాన్స్ ను పాడుచేస్తుంది. అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే ఈ డయాబెటిస్ టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ అనే రెండు రకాలు ఉంటుందని ఇప్పటివరకు అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం టైప్ 5 డయాబెటిస్ ఆందోళన కలిగిస్తుంది.ముఖ్యంగా టీనేజర్లను, యువతను టార్గెట్ చేసి ఈ టైప్ 5 డయాబెటిస్ వేధిస్తుంది అని తాజాగా ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ దీనిని ధ్రువీకరించింది. థాయిలాండ్ రాజధాని అయిన బ్యాంకాక్ లో ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు నిర్వహించిన వరల్డ్ డయాబెటిస్ కాంగ్రెస్ లో ఈ టైప్ 5 డయాబెటిస్ గురించి అధికారికంగా ప్రకటించడం జరిగింది.ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందినవారు ఈ టైప్ ఫైవ్ డయాబెటిస్ బారిన పడుతున్నారని డయాబెటాలజిస్ట్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 2.5 కోట్ల మందికి ఈ టైప్ 5 డయాబెటిస్ వచ్చిందని ఒక అంచనా. ఇది పోషకాహార లోపంతో వస్తుందని చిన్న వయసులో సరైన పోషకాహారం లేని వారు బలహీనంగా ఉండేవారు టైప్ 5 డయాబెటిస్ బారిన పడుతున్నారని చెప్పారు.టైప్ ఫైవ్ డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుందని, వీరికి ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ కంపల్సరీ వాడాలని పేర్కొన్నారు. అయితే టైప్ 2 డయాబెటిస్ బాధితుల మాదిరిగా వీరి శరీరం ప్రతిస్పందించదు.ముఖ్యంగా యువత, టీనేజర్లు పోషకాహార లోపం లేకుండా చూసుకుంటే టైప్ 5 డయాబెటిస్ బారిన పడకుండా ఉంటారని సూచిస్తున్నారు. ఈ కొత్త రకం డయాబెటిస్ పైన అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ ని కూడా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా యువత ఆందోళనకు కారణమవుతున్న టైప్ ఫైవ్ డయాబెటిస్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video