హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ సంపాదన ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. స్టార్ హీరోకు 90 ఏళ్లు వచ్చినా హీరో పాత్రల్లోనే నటిస్తారు. కానీ హీరోయిన్లు అలా కాదు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నట్లు వాళ్లకుండే ఆ 4-5 ఏళ్ల కెరీర్ లోనే జీవితాంతం సరిపోయేలా సంపాదించుకోవాలి. ఒక్క ప్లాఫ్ తో హీరోకు ఏమీకాదు కానీ అదే ప్లాఫ్ హీరోయిన్ కెరీర్ కు ఎంతో రిస్క్ అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తుంటాయి.అయితే టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ ఏకంగా రూ. 200కోట్ల ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఏంటీ రూ. 200కోట్లా.. ? అంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూ అన్ని కోట్లు రావేమో ఒక్క సినిమాకు. మరి ఇంత పెద్ద జాక్ పాట్ ను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరా అని మీరు ఆలోచిస్తున్నారా..? ఆమె ఎవరో కాదు మన సమంత. ఇప్పుడేమే గానీ ఓ పదేళ్ల క్రితం చూడాలి.. అమ్మడి రచ్చ. ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ హిట్టే.. యువతలో ఎవర్ని కదిపినా సామ్ నామం జపిస్తూ ఉండేవారు. అంతలా మాయ చేసింది ఈ బ్యూటీ.
సినిమా
రూ.200 కోట్ల ఆఫర్ను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
- by kadali Lavanya
- March 28, 2025
- 0 Comments
- Less than a minute
- 15 Views
- 2 months ago

Leave feedback about this