ఏపీలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇందులో భాగంగా పారదర్శకంగా పరీక్షల నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. పేపర్ లీక్ ల సహా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటోంది. ఈనెల 17 నుండి ఏప్రిల్ 1 వరకూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగబోతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ఎలాంటి అవాంచనీయ ఘటనలకు ఆస్కారం లేని రీతిలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్య, ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షలపై రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం ద్వారా సన్నాహక ఏర్పాట్లపై సమీక్షించారు. చీఫ్ సూపరింటిండెంట్ మినహా ఎవరి మొబైల్ ఫోన్ ను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. ఎవరైనా మొబైల్ ఫోన్లు తీసుకువస్తే వాటిని పరీక్షా కేంద్రాల ప్రధాన గేటువద్దే వాటిని సేకరించి భద్రపర్చి పరీక్ష అనంతరం వాటిని తిరిగి అప్పగించాలన్నారు.
ఎడ్యుకేషన్ & కెరీర్
ఏపీలో పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు..!
- by kowru Lavanya
- March 13, 2025
- 0 Comments
- Less than a minute
- 58 Views
- 10 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this