ఏపీలో చాలా పెండింగ్ లో ఉన్న కొత్త కానిస్టేబుళ్ల నియామకాలు, ప్రమోషన్లు, కొత్త బెటాలియన్ల ఏర్పాటుపై హోంమంత్రి వంగలపూడి అనిత తాజాగా అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో ఆమె క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ ఉద్యోగాలు, ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఊరట దక్కినట్లయింది.రాష్ట్రంలో మొత్తం 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ ఉన్నాయని హోంమంత్రి అనిత వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 16,862 కానిస్టేబుల్ పోస్టుల్లో 6,100 పోస్టుల నియామకం పూర్తి కాబోతుందన్నారు. మిగిలిన 10,762 ఖాళీల నియామకానికి సంబంధించి ప్రభుత్వానికి, డీజీపీకి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు ఆమె తెలిపారు. అనుమతులు రాగానే మిగిలిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు చేపడతామని హోంమంత్రి అనిత వెల్లడించారు. కానిస్టేబుల్ ఖాళీల నియామకానికి అన్ని పరీక్షలు పూర్తయ్యాయన్నారు. కేవలం మెయిన్స్ మిగిలిందన్నారు. దీనిపై వివాదం కోర్టులో ఉందన్నారు. అఫిడవిట్ దాఖలు చేసి 45 రోజుల్లో కానిస్టేబుళ్లను ట్రైనింగ్ కు పంపిస్తామన్నారు.
ఎడ్యుకేషన్ & కెరీర్
ఏపీలో కానిస్టేబుళ్ల పోస్టింగ్స్, ప్రమోషన్లపై హోంమంత్రి గుడ్ న్యూస్..!
- by kowru Lavanya
- March 21, 2025
- 0 Comments
- Less than a minute
- 17 Views
- 3 months ago

Leave feedback about this