June 8, 2025
సినిమా

“ఛావా” రికార్డ్ కలెక్షన్స్.. అదొక్కటే మైనస్..

“యూరీ సర్జికల్” స్ట్రైక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్. ఆ తర్వాత “సర్ధార్ ఉద్దమ్”, “సామ్ బహదూర్” లాంటి సందేశాత్మక చిత్రాలతో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. తాజాగా విక్కీ కౌశల్ నటించిన చిత్రం “ఛావా”. ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. విడుదలైన తొలిరోజే రూ. 31 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే బాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా “ఛావా” నిలిచింది. ఇటీవల విడుదలైన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ “స్కై ఫోర్స్” మూవీ రూ. 15.30 కోట్లు రాబట్టి ఇప్పటి వరకు తొలి స్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా ఆ ప్లేస్ ను “ఛావా” అధిగమించింది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video