June 8, 2025
ఆరోగ్యం

వేసవిలో బెస్ట్ పానీయం కొబ్బరినీళ్ళు.. ఆరోగ్య ప్రయోజనాలు ఫుల్లు!

వేసవి కాలంలో విపరీతమైన ఎండలకు చిన్న పెద్ద అని వయస్సుతో సంబంధం లేకుండా ఎలాంటివారైనా తట్టుకోలేకపోతుంటారు. ఈ వేసవికి తట్టుకోవడానికి మన శరీరానికి కావలసిన మిటమిన్లు, పోషకాలు కొబ్బరి నీళ్లలో సమృద్ధిగా దొరుతాయి. డీ హైడ్రేషన్ ను నివారించడానికి కొబ్బరి నీళ్లు ఎంతో బాగా దోహదం చేస్తాయి. కొబ్బరి నీళ్లలో యాంటి ఆక్సిడెంట్ లు ఉంటాయి. మరియు రోగ నిరోధక శక్తినీ బలోపేతం చేయడానికి కొబ్బరి నీళ్లు దోహదపడతాయి..

కొబ్బరి నీళ్లను ఈ సమయాల్లో తాగితే మంచి ప్రయోజనం రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఉదయాన్నే అంటే పరగడుపున ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అధిక బరువును నియంత్రిస్తుంది. పరగడుపున కొబ్బరి నీళ్ళతో రోజంతా శరీరం యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఉదయం వ్యాయామం చేసిన వెంటనే మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. అలసట తగ్గుతుంది.

రాళ్ళను సైతం కరిగించే శక్తి కొబ్బరినీళ్ళకు ఉంటుంది శరీరంలో వేడిని తగ్గించడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి . వేసవి కాలంలో ఎన్ని నీళ్లు తాగిన చెమట రూపంలో నీరు వెళ్ళిపోతుంది. ఈ విధంగా జరగడంతో శరీరానికి సరిపడా నీరు అందకపోవడంతో మూత్ర పిండాలలో సమస్యలు ఏర్పడుతాయి. ముఖ్యంగా మూత్ర పిండాలలో రాళ్ళు వస్తాయి ,అలాగే మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటుంది. వీటన్నిటికి సరైన పరిష్కార మార్గం కొబ్బరి నీళ్ళు తాడగమే. ఈ సమస్యల నుండి కొబ్బరి నీళ్ళతో ఉపశమనం కొబ్బరి నీళ్లు రోజు ఒక లీటర్ కనుక తాగితే మూత్ర విసర్జన సమయంలో సమస్యలు ఉండవు. మూత్ర పిండాలలో రాళ్ళను కొబ్బరి నీళ్ళు కరిగిస్తాయి..రక్త ప్రసరణ సరిగ్గా లేకుంటే శరీరంలో అనేక ఇబ్బందులు వస్తాయి. నరాలు, కండరాల నొప్పులు వస్తాయి. కంటి చూపు సమస్య మొదలౌతుంది. అలాంటి అనేక సమస్యలకు లేత కొబ్బరి నీళ్లు తాగడం వలన ఉపశమనం పొందుతారు.

కొబ్బరి నీళ్ళతో ఆరోగ్యం కొబ్బరి నీళ్ళు రక్తపోటును నియంత్రిస్తాయి.జీర్ణ క్రియకు దోహదం చేస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి.ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే కొబ్బరినీళ్ళు అతిగా తాగటం మంచిది కాదు. ఏదైనా మితంగా తీసుకుంటేనే మంచి ప్రయోజనం ఉంటుంది. .

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video