June 8, 2025
సినిమా

ఏం జరిగింది?… విజయ్‌పై యుద్ధాన్ని ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో ‘వార్2’ చేస్తున్నారు. ఇది మల్టీస్టారర్ సినిమా. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. మైత్రీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించబోతోంది. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇండియా, బర్మా, చైనా దేశాలను గడగడలాడించి డ్రగ్ స్మగ్లర్ కథతో ఈ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ‘డ్రాగన్’ విడుదల తేదీని కూడా దర్శకుడు నీల్ ప్రకటించారు. 2026 జనవరి 9వ తేదీన విడుదల చేయబోతున్నారు. అంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రాబోతోంది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video