June 8, 2025
ఆరోగ్యం

ఈ కూల్ డ్రింక్స్ తాగితే గుండెకు ముప్పు.. ఇక డాక్టర్స్ కూడా కాపాడలేరు!

వేసవి వచ్చిందంటే చాలు.. గొంతు తడారిపోకుండా, శరీరం చల్లబడాలని చాలా మంది ముందుగా వెతుక్కునేది కూల్ డ్రింక్స్ (శీతల పానీయాలు) కోసమే. క్షణాల్లో ఇవి ఇచ్చే తక్షణ ఉపశమనం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. పార్టీలైనా, సినిమాలైనా, స్నేహితులతో కబుర్లైనా.. పక్కన ఓ కూల్ డ్రింక్ బాటిల్ ఉండాల్సిందే అన్నంతగా ఇవి మన జీవనశైలిలో భాగమైపోయాయి. కానీ.. ఇవి మన ఆరోగ్యానికి, ముఖ్యంగా మన గుండెకు మంచివేనా? ఈ శీతల పానీయాల వెనుక దాగి ఉన్న ప్రమాదం ఏమిటి?కూల్ డ్రింక్స్ రుచిగా ఉండటానికి ప్రధాన కారణం వాటిలో ఉండే అధిక మొత్తంలో చక్కెర మరియు కార్బోనేషన్. ఒక్క మీడియం సైజ్ కూల్ డ్రింక్ బాటిల్‌లో దాదాపు 7 నుండి 10 టీస్పూన్ల వరకు చక్కెర ఉండవచ్చంటే మీరు నమ్మగలరా? ఇది మనం ఒక రోజులో తీసుకోవాల్సిన చక్కెర పరిమాణం కంటే చాలా రెట్లు ఎక్కువ. ఈ అదనపు చక్కెర , ఖాళీ కేలరీలు . ఇవి కేవలం శక్తినిచ్చేవి, పోషకాలు లేనివి. కనుక ఇది మన శరీరంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతాయి.బరువు పెరగడం , ఊబకాయం: కూల్ డ్రింక్స్ ద్వారా శరీరంలో చేరే అదనపు చక్కెర సులభంగా కొవ్వుగా మారుతుంది. ఇది త్వరగా బరువు పెరగడానికి, చివరికి ఊబకాయానికి దారితీస్తుంది. ఊబకాయం అనేది గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో ఒకటి.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video