డయాబెటిస్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధి అయిన డయాబెటిస్ మన శరీరంలోని అన్ని ఆర్గాన్స్ పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. డయాబెటిస్ బారిన పడినవారు జాగ్రత్త తీసుకోకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు దీర్ఘకాలంలో గుండెజబ్బులను, మూత్రపిండాల వ్యాధులను, నరాల సంబంధిత జబ్బులను, కంటి చూపు కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే డయాబెటిస్ బారిన పడినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. జీవనశైలి మార్చుకోవాల్సిన అవసరం ఉందని, ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలని చెపుతారు.డయాబెటిస్ బారిన పడినవారు చాలామంది ఏది తినాలన్నా, ఏది తాగాలన్న విపరీతంగా భయపడతారు. కొంతమంది డయాబెటిస్ బాధితులు కొబ్బరినీళ్లు తాగాలన్న భయపడుతూ ఉంటారు. అసలు డయాబెటిస్ బాధితులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా? తాగకూడదా అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. డయాబెటిస్ బాధితులు కొబ్బరి నీళ్లు తాగవచ్చు. అయితే రోజుకు ఒకటి నుంచి రెండు కప్పులు కొబ్బరి నీళ్లు మాత్రమే తాగడం మంచిది అంతకంటే ఎక్కువ కొబ్బరి నీళ్లు డయాబెటిస్ బాధితులు తాగకూడదు.ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచి డయాబెటిస్ ను నియంత్రణలో లేకుండా చేస్తుంది. కొబ్బరి నీళ్లు తక్కువ క్యాలరీల పానీయం అయినప్పటికీ టైప్ టు డయాబెటిస్ తో బాధపడే వారికి, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో లేనివారికి కొబ్బరి నీళ్ళను ఎక్కువగా తాగడం మంచిది కాదని చెబుతారు.
ఆరోగ్యం
డయాబెటిస్ బాధితులు కొబ్బరినీళ్ళు తాగొచ్చా.. లేదా?
- by kowru Lavanya
- May 13, 2025
- 0 Comments
- Less than a minute
- 11 Views
- 4 weeks ago

Leave feedback about this