మానవ శరీరంలో కాలేయం అత్యంత ముఖ్యమైన అవయవం. కాలేయం మన శరీరంలో టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో, జీర్ణక్రియకు తోడ్పడటం లో కీలక భూమిక పోషిస్తుంది.అటువంటి కాలేయం ఆరోగ్యంగా ఉంటే మనం కొంతమేర ఆరోగ్యవంతులుగా ఉన్నట్టే. కాలేయానికి కొన్ని ఆహారాలు ప్రమాదకరం. మనకు తెలియకుండానే కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.కాలేయం ప్రమాదం బారిన పడకుండా ఉండాలంటే ఏమి తినకూడదో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. కాలేయం ప్రమాదం బారిన పడకుండా ఉండాలంటే కృత్రిమ స్వీటెనర్లు తినకూడదు. ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ వంటి నూనెలో వేయించిన పదార్థాలను తినకుండా ఉంటేనే మంచిది. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఫాస్ట్ ఫుడ్స్ జోలికి వెళ్ళకూడదు. అంతే కాదు గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తినకుండా ఉండాలి.ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే ఫుడ్ లు కాలేయం పైన ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి కాలేయంలో కొవ్వు పేరుకు పోవడానికి కారణమవుతాయి. ఇక కాలేయం ఆరోగ్యంగా ఉండాలని భావించేవారు రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మీట్ తినకుండా ఉండాలి. స్నాక్స్, సోడాలు, కూల్ డ్రింక్స్, కచప్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి కాలేయంలో కొవ్వు పేరుకు పోవడానికి కారణమవుతాయి.
ఆరోగ్యం
వీటిని తింటే మీ లివర్ పాడైపోతుంది… జాగ్రత్త!
- by kowru Lavanya
- May 1, 2025
- 0 Comments
- Less than a minute
- 14 Views
- 1 month ago

Leave feedback about this