సహజంగా ఆకుకూరల్లో లభించే పోషకాలు, మిటమిన్లు ఇతర ఏ కూరగాయల్లోనూ అంతగా లభించవు. ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి మంచిది అని డాక్టర్లు చెబుతుంటారు..మరి అవే ఆకు కూరలను జ్యూస్ చేసుకొని తాగితే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ఆకుకూరలలో పాలకూరకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. పాలకూర పుష్కలంగా పోషకాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.పాలకూరను జ్యూస్ చేసుకొని తాగడం వలన మనకు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు కావలసినన్ని లభిస్తాయి.. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడతాయి ,చర్మం పొడిబారకుండా ,ముడతలు రాకుండా కాపాడతాయి. పాలకూరలో మిటమిన్ ఏ కంటి చూపు సమస్య ఉన్నవారికి, రే చీకటితో బాధపడేవారికి ఉపయోగపడుతుంది . కాబట్టి పాలకూర జ్యూస్ తాగడం వలన ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
ఆరోగ్యం
అందంతో పాటు ఆరోగ్యం కావాలంటే ఈ జ్యూస్ తాగండి!
- by kadali Lavanya
- April 30, 2025
- 0 Comments
- Less than a minute
- 27 Views
- 4 months ago
Leave feedback about this