December 24, 2025
భక్తి

TTD: నేరుగా శ్రీవారి దర్శనం, పరిమితులు- తాజా మార్గదర్శకాలు..!!

Tirumala: తిరుమలలో సాధారణ భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి రద్దీ వేళ కొత్త నిర్ణయాల అమలుకు సిద్దమైంది. రేపు (మే 1) నుంచి తిరుమలలో బ్రేక్ దర్శనాల వేళల్లో మార్పులు జరుగుతున్నాయి. బ్రేక్ దర్శనాల మార్పును ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు టీటీడీ సిద్దమైంది. ఇక.. సిఫారసు లేఖల పైన దర్శనాల విషయంలోనూ టీటీడీ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం తిరుమలలో రద్దీ తగ్గింది. భక్తులు నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇక, టీటీడీ భక్తులకు సైతం కొన్ని సూచనలు చేసిందిసిఫారసు లేఖల రద్దు వేసవి సెలవుల్లో భారీగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంది. మే 1వ తేదీ నుంచి బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేస్తోంది. అదే విధంగా మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు సిఫారసు లేఖలు అనుమతించకూడదని నిర్ణయించింది. ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని టీటీడీ స్పష్టం చేసింది. ప్రొటోకాల్‌ వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనాలు ఉంటాయని టీటీడీ వెల్లడించింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్య త కల్పించేందుకు సిఫార్సు లేఖలు రద్దు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. అదే విధంగా బ్రేక్ దర్శనాల సమయంలో మార్పుల ను ప్రయోగాత్మాకంగా అమలుకు నిర్ణయించింది.బ్రేక్ వేళల మార్పు తిరుమలలో మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో టీటీడీ మార్పులు చేసింది. మే 1 నుంచి ఉదయం 6 గంటల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే వీఐపీ దర్శనం కల్పిస్తామని వెల్ల డించింది. మే 1 నుంచి జులై 15వ వరకు ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు టీటీడీ అధికా రులు స్పష్టం చేసారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకు న్నట్లు వెల్లడించింది. ఈ వేళల మార్పు ద్వారా ఎక్కువ సమయం క్యూ లైన్లలో ఉంటున్నా సాధా రణ భక్తులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న కొత్త వేళల ద్వారా ఎలాంటి ఫలితం ఉంటుందో గమనించి.. కొనసాగింపు పైన నిర్ణయించనున్నారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video