Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 74,020 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 31,190 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.27 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.తిరుమల భద్రతపై టీటీడీ పాలకమండలి పలు నిర్ణయాలను తీసుకుంది. ప్రతి రోజూ దేశం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం కావడం వల్ల భద్రతపరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని భావిస్తోంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు సంత్రప్తికరంగా తిరిగి వెళ్లేలా చర్యలు చేపట్టింది.దీనిపై చర్చించడానికి అత్యున్నత సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది టీటీడీ పాలకమండలి. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఏర్పాటైన ఈ సమావేశానికి పోలీసు శాఖ, టీటీడీ, ఇతర భద్రతా విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షెముషి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడారు. ఇటీవల పహల్గామ్ ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో భద్రతను మరింత బలోపేతం చేయడంపై ద్రష్టి సారించామని, ఇందులో భాగంగా సెక్యూరిటీ ఆడిట్ చేపట్టామని పేర్కొన్నారు. అన్ని భద్రతా దళాలు, టీటీడీ విభాగాల సమన్వయంతో పనిచేస్తూ, భక్తుల మనోభావాలను కాపాడటానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
భక్తి
తిరుమల భద్రతపై ప్రభుత్వం కొత్త ప్రతిపాదన?
- by kowru Lavanya
- May 16, 2025
- 0 Comments
- Less than a minute
- 76 Views
- 7 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this