December 24, 2025
సినిమా

‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రిలీజ్, ఇదేందయ్యా ఇలా ఉంది..!

మంచు విష్ణు ప్రతీష్టాత్మకంగా నిర్మిస్తూ , నటిస్తోన్న సినిమా ‘కన్నప్ప’. సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విష్ణు.. తిన్నడు పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్‌ అధిక భాగం న్యూజిలాండ్‌లో జరిగింది. కన్నప్ప భక్తి చిత్రం మాత్రమే కాదని, అదొక చరిత్ర అని మంచు విష్ణు తెలిపారు.ఈ సినిమా టీజర్‌ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రదర్శితమైన సంగతి తెలిసిందే.

ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఇందులో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. కాజల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితరుల కూడా నటించారు. తాజాగా ఈ సినిమాలోని ప్రభాస్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.తొలుత ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆ పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పోషించారని తెలుస్తోంది. సినిమాలోని కీలక పాత్రలో ప్రభాస్ నటించారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video