జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 7వరకు దేవుని కడపలో వార్షిక బ్రహ్మోత్సవాలు
ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపధ్యంలో జనవరి 28వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగనుంది. జనవరి 29వ తేదీ ఉదయం 9.30 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 29వ తేదీన రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు.
కన్నుల పండుగగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సందర్భంగా టీటీడీ పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దేవుని కడప ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ కన్నుల పండుగగా నిర్వహించను
Leave feedback about this