June 8, 2025
ఆరోగ్యం

ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ఇవే… జాగ్రత్త!

ప్రస్తుత సమాజంలో క్యాన్సర్ అనేది ప్రజలను భయపెడుతున్న పరిస్థితి ఉంది. లంగ్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్లతో ప్రజలు బాధపడుతున్నారు. అయితే క్యాన్సర్ లక్షణాలు ఎప్పుడు సాధారణ లక్షణాలు గానే కనిపిస్తాయి. వీటిని గుర్తించడం చాలా కష్టం. ప్రస్తుతం మనం ఊపిరితిత్తుల క్యాన్సర్ కు సంబంధించిన సాధారణ లక్షణాలను తెలుసుకుందాం.

ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ఈ లక్షణాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడేవారు నిరంతరం దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. బాగా దగ్గుతున్నప్పుడు రక్తం కూడా వస్తుంది. ఛాతి నొప్పి, శ్వాస ఆడకపోవడం, బరువు తగ్గడం, అలసట, గొంతు బొంగురు పోవడం, స్వరం మార్పులు చోటు చేసుకుంటాయి. చాతి ఇన్ఫెక్షన్లు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి, ఇక ఊపిరితిత్తుల క్యాన్సర్ కి సంబంధించి ఇతర లక్షణాలను చూసినట్లయితే చేతులు లేదా కాళ్లు తిమ్మిర్లు లేదా బలహీనత వస్తుంది. ఎముకల నొప్పి వస్తుంది.

దీర్ఘకాలిక దగ్గు … జాగ్రత్త తలనొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. కామెర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. మెడ దగ్గర లేదా కాలర్ బోన్ దగ్గర గడ్డలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు దగ్గినా ఊపిరి తీసుకున్నా ఊపిరితిత్తుల్లో నొప్పి వస్తుంటే కచ్చితంగా వైద్యుడికి చూపించుకోవాలి. మూడు వారాలకు మించి దీర్ఘకాలికంగా దగ్గు వస్తుంటే పరీక్షలు చేయించుకోవాలి. ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చి ఉంటే ఛాతీలో వివిధ రకాల ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడతాయి. దగ్గితే రక్తం వస్తుందా జాగ్రత్త దీర్ఘంగా శ్వాస తీసుకోలేని పరిస్థితి వస్తుంది. దగ్గినప్పుడు రక్తం వస్తున్నా లేదా కఫం లేత ఎరుపు రంగులో వస్తున్న తక్షణమే వైద్యపరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలి. ఎవరైనా ఉన్నట్టుండి బరువు తగ్గడం గాని, జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయక పోవడం గాని జరుగుతుంటే లంగ్ క్యాన్సర్ లక్షణంగా భావించే ఈ పరీక్షలు చేయించుకోవాలి. ప్రతిరోజు చేసే పనులు అయినప్పటికీ తరచూ అలసిపోతుంటే బలహీనంగా అనిపిస్తుంటే కూడా ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకోవాలి.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video