ఏపీలో అమరావతి రాజధానికి మరో గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే ఐదేళ్లుగా నిలిచిపోయిన అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనికి ప్రపంచ బ్యాంక్ తో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు, మరికొన్ని ఆర్ధిక సంస్థలు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో అందులో కీలకమైన హడ్కో ఇవాళ అమరావతి రాజధానికి రుణంపై కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్లు రుణం విడుదలకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవపల్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (హడ్కో) ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై లో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు అనుమతి లభించింది. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా 11 వేల కోట్లు రుణం కోసం సంప్రదింపులు జరిపామని, హడ్కో తాజా నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.