తెరచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు- చార్‌ధామ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
Kedarnath dham: దేవభూమిగా భాసిల్లుతున్న ఉత్తరాఖండ్‌లో వెలిసిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి- కేదార్‌నాథ్. జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారనాథుడిని దేశం నలుమూలల నుంచి ఏటా లక్షలాదిమంది దర్శించుకుంటుంటారు. కేదార్‌నాథ్‌తో కలిపి చార్ ధామ్ యాత్రల్లో పాల్గొంటుంటారు. ఇప్పుడు తాజాగా కేదార్‌నాథ్ ఆలయం తలుపులు తెరచుకున్నాయి. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ఆలయం తలుపులను తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేదారనాథుడికి తొలి పూజలు చేశారు.తొలుత