ఏపీ ఇంటర్ లో కీలక మార్పులు-ఎన్సీఈఆర్టీ సిలబస్-ఒక్క మార్కు ప్రశ్నలు..!
ఏపీలో ఇంటర్ మీడియట్ విద్యలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం అంటే 2025-26 నుంచి ఈ మార్పుల్ని అమలు చేసేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. ఈ మేరకు కాలేజీలకు సమాచారం కూడా ఇచ్చింది. ముఖ్యంగా సిలబస్ తో పాటు పరీక్షల విధానంలోనూ పెను మార్పులు చేస్తోంది. దీంతో ఇంటర్ ఫస్టియర్ చదివే విద్యార్ధులకు ఎన్సీఈఆర్టీ సిలబస్ అందుబాటులోకి రానుంది. అలాగే పరీక్షల్లో ఒక్క మార్కు ప్రశ్నలు రాబోతున్నాయి.ఇంటర్ లో మ్యాథ్స్ పేపర్ ఇప్పటివరకూ 75