కోలీవుడ్ స్టార్ హీరోఅజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరోగా నిరూపించుకున్నారు అజిత్. ఇటీవల ఆయన దుబాయ్ కార్ రేస్ ఈవెంట్ లో పాల్గొని విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. అజిత్ రేసర్ల గ్రూప్ నాయకుడు కావడంతో ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అందుకే రేసులో విక్టరీ సాధించాడు. అయితే తాజాగా అజిత్ కు కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని అందించింది. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్రం ఆయనకు దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ తో సత్కరించింది. దీనిపై అజిత్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Leave a Comment
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
