apollonews.in Blog సినిమా విజయ్‌ ఆఖరి చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్నికల సమయంలోనే.. ఎప్పుడంటే..?
సినిమా

విజయ్‌ ఆఖరి చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్నికల సమయంలోనే.. ఎప్పుడంటే..?

ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. 2026లో తమిళనాడులో జరిగే శాసనసభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నారు. అయితే విజయ్ ఆఖరి చిత్రం జన నాయగన్ పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ ను స్క్రీన్ పై చూసే ఆఖరి చిత్రం కావడంతో ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Exit mobile version