ఆర్యవైశ్య కుల దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు బుధవారం నరసాపురంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రామాలయంలో కొలువై ఉన్న శ్రీ వాసవి మాతను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు నూలి శ్రీనివాస్, సెక్రటరీ కంచర్ల బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం: ఘనంగా వాసవి మాత జయంతి
