apollonews.in Blog సినిమా బాలీవుడ్ లోకి కిసిక్ బ్యూటీ.. స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా ..!
సినిమా

బాలీవుడ్ లోకి కిసిక్ బ్యూటీ.. స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా ..!

తెలుగు నటి శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఓ వైపు స్టార్ హీరోల సరసన కథానాయికగా చేస్తూనే.. మరోవైపు ఐటెం సాంగ్స్ తో రఫ్పాడిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ ‘పుష్ప-2’లో కిసిక్ సాంగ్ లో శ్రీలీల చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సాంగ్ తో తెలుగు రాష్ట్రాలతోపాటు హిందీ చిత్ర పరిశ్రమనూ ఓ ఊపుఊపింది ఈ భామ.అంతకు ముందు ‘గుంటూరు కారం’ చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ తో, ‘ధమాకా’ చిత్రంలో రవితేజతోనూ స్టెప్పులేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం శ్రీలీల నితిన్ ‘రాబిన్ హుడ్ ‘, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రాలతో బిజీగా ఉంది.

Exit mobile version