తెలుగు రాష్ట్రాల్లో నేటితో విద్యా సంవత్సరం ముగియనుంది. రేపు (గురువారం) నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు ఈ నెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకూ వేసవి సెలవులను ప్రకటించారు. వచ్చే విద్య సంవత్సరం జూన్ 12న ప్రారంభం కానున్నాయి. జూనియర్ ఇంటర్ కాలేజీలకు సెలవులు అమలు కానున్నాయి. ఇక, ఇదే సమయంలో ప్రభుత్వం సెలవుల వేళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.వేసవి సెలవుల ప్రారంభం వేళ ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు సర్క్యులర్‌ను మంగళవారం జారీ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలకు చివరి పనిదినంగా బుధవారం (ఈ నెల 23) అని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. భారత వాతావరణశాఖ, వైద్య ఆరోగ్యశాఖ సూచనల ప్రకారం వేసవి సెలవుల్లో మార్పులకు అవకాశం ఉందని సర్క్యులర్‌లో వెల్లడించారు. కాగా, పాఠ శాలల పున ప్రారంభం సంసిద్ధత కోసం జూన్ 5 నుంచి టీచర్లు విధులకు హాజరు కావాలని స్పష్టం చేసారు. తాజా సర్క్యులర్ స్టేట్ సిలబస్ అమలు చేస్తున్న అన్ని పాఠశాలలకు వర్తిస్తుంది.
వేసవి సెలవుల ప్రారంభం వేళ విద్యా శాఖ కీలక ఉత్తర్వులు..!!
