Bird Flu: ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల, కోవూరు మండలం గుమ్మలదిబ్బలో కోళ్ల మరణాలకు సంబంధించి.. నమూనాలను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపగా ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వ్యాధి సోకినట్లు నిర్ధారించారని పశుసంవర్ధకశాఖ సంచాలకులు అమరేంద్రకుమార్ పేర్కొన్నారు. ప్రభావిత గ్రామాలకు చుట్టూ కిలోమీటరు వరకు ఇన్‌ఫెక్టెడ్ జోన్‌గా, పది కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ ప్రాంతంగా ప్రకటించినట్లు వివరించారు. కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రాకపోకలు కట్టడి చేశామన్నారు. అయితే, పక్షుల్లో ప్రాణాంతకమైన ఈ బర్డ్ ఫ్లూ, కొన్ని సందర్భాల్లో మానవులకు సోకే ప్రమాదముందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
