ఐక్యరాజ్య సమితికి ట్రంప్ గుడ్‌బై: నెక్స్ట్ టార్గెట్ అదే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగుతూనే వస్తోంది. ఆ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ వివిధ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నారు. తన దైన శైలిలో పాలన సాగిస్తోన్నారు. అంతర్జాతీయ వేదికలనూ వదలట్లేదు. ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే- ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి బయటికొచ్చారు. ఈ అత్యుత్తమ అంతర్జాతీయ వేదిక నుంచి అమెరికా వైదొలగడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయడం కలకలం రేపింది. డబ్ల్యూహెచ్‌ఓకు నిధుల