GATE Answer Key 2025 : గేట్ – గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2025) దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. ఈ పరీక్షలను 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఉదయం 9.30 నుంచి 12.30 వరకు.. అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పరీక్షలు నిర్వహించారు. టెస్ట్ పేపర్ల వారీగా గేట్ 2025 పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీలను ఐఐటీ రూర్కీ (IIT Roorkee) త్వరలో వెల్లడించనుంది. అనంతం మార్చి 19న గేట్ 2025 రిజల్ట్ వెల్లడించనునున్నట్లు సమాచారం. అభ్యర్థులు ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్, రిజల్ట్ తదితర వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://gate2025.iitr.ac.in/చూడొచ్చు.
GATE Answer Key Response Sheet 2025 : గేట్ 2025 ఆన్సర్ కీ, రెస్పాన్స్షీట్ అప్డేట్స్
