apollonews.in Blog సినిమా నేచురల్ స్టార్ ఫ్యాన్స్ కి నరాలు కట్.. ఆ డైరెక్టర్ తో నాని నెక్స్ట్ మూవీ
సినిమా

నేచురల్ స్టార్ ఫ్యాన్స్ కి నరాలు కట్.. ఆ డైరెక్టర్ తో నాని నెక్స్ట్ మూవీ

నేచురల్ స్టార్ నాని తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తన సహజ నటనతో అందరి మన్ననలు పొందాడు నాని. తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం ప్రారంభించినప్పటికీ.. అష్టాచమ్మా సినిమాతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన నటించిన రైడ్, అలా మొదలైంది, పిల్ల జమీందార్ జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈగతో స్టార్ డమ్ తెచ్చుకున్న నాని.. భలే భలే మగాడివోయ్, మజ్ను, భీమిలి కబడ్డీ జట్టు, జెర్సీ సినిమాలతో ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేసుకోగలిగాడు. గడిచిన రెండేళ్లలో ‘దసరా’ ‘హాయ్ నాన్న’ ‘సరిపోదా శనివారం’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి జోష్ లో ఉన్నారు నాని.

Exit mobile version