AP Inter Hall Ticket 2025 : ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే విద్యార్థులు వాట్సప్ ద్వారా ప్రాక్టికల్ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు కాలేజీలు హాల్‌టికెట్లు ఆపేయడం వంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం 161 సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యరంగం సేవలు కూడా వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది.
AP Inter Hall Tickets WhatsApp : ఏపీ ఇంటర్ హాల్‌టికెట్లు 2025.. వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ ప్రాసెస్ ఇదే
