apollonews.in Blog సినిమా విశ్వక్ సేన్‌కు మరో షాక్..ఓటీటీలోకి లైలా..?
సినిమా

విశ్వక్ సేన్‌కు మరో షాక్..ఓటీటీలోకి లైలా..?

యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం లైలా.రామ్ నారాయణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించారు. ఈ సినిమాపై విశ్వక్ సేన్ చాలానే ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమా ప్రమోషన్స్ చేయడంతో లైలాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్‌తో వైసీపీ క్యాడర్ ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు, నటుడు పృథ్వీ సైతం వైసీపీకి క్షమాపణలు చెప్పడం జరిగింది.అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Exit mobile version