సెలబ్రిటీలు బయటకనపడితే మొదట మన దృష్టి వెళ్లేది వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్ మీదకే. రకరకాల ఫ్యాషన్ బ్రాండ్ లతో సినీ ప్రముఖులు దర్శనమిస్తుంటారు. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన క్రేజీ డ్రెస్సింగ్ స్టైల్ తో కెమెరాకు చిక్కారు. తాజాగా ముంబై వేదికగా నాలుగు రోజులపాటు జరగనున్న ‘వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్'(వేవ్స్)లో సందడి చేసేందుకు అల్లు అర్జున్ ముంబై బయల్దేరారు అక్కడ ఆయన వేసుకున్న టీషర్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ అనే మీమ్ ను తన టీ షర్ట్ పై వేసుకొని కనిపించాడు. ఇది సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఇంతకు ముందు ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా ట్రెండ్ చేసిన సంగతి తెలిసిందే. బైకుల మీద, కార్ల మీద ఎక్కడ చూసిన ఇదే ట్రెండింగ్ అవుతూ కనిపించింది. ఇప్పుడు అల్లు అర్జున్ సైతం ‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ అనే మీమ్ తో ఉన్న టీ షర్ట్ ధరించడంతో అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ సీన్ లో కూడా బ్రహ్మానందం ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. నెల్లూరు పెద్దారెడ్డి అని చెప్పినా అరెస్ట్ చేస్తారు. అయితే ఇది కామెడీ సీన్ అయినప్పటికీ ఇలాంటి మీమ్ అల్లు అర్జున్ ధరించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక తాజాగా సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ కూడా ఆస్పత్రి డిశ్చార్జ్ కావడంతో.. బన్నీ ఇలాంటి సమయంలో ఈ మీమ్ తో కనిపించడంతో పోలీసులకు తన వైఖరి తెలిపేందుకే అల్లు అర్జున్ ఈ టీషర్టు ధరించినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొంతమంది మాత్రం పవన్ కల్యాణ్ ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’కు కౌంటర్ ఇచ్చాడుగా అని గుసగుసలు ఆడుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్..? మెగా ఫ్యామిలీ అలెర్ట్..!
